![]() |
![]() |

స్టార్ మాలో ప్రేక్షకులను అలరిస్తోన్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఇది ఇప్పుడు చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. శనివారం రోజు జరిగిన ఎపిసోడ్-48 లో కమిషనర్ దగ్గరకి వెళ్తాడు మురారి. ఆ తర్వాత తన మీద వచ్చిన ఎలిగేషన్ గురించి మాట్లాడి బయటకు వచ్చేసి ఒక దగ్గర ఆలోచిస్తూ కూర్చుంటాడు. అదే సమయానికి ఇంట్లో వాళ్ళంతా మురారి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎంతసేపటికి మురారి రాకపోయేసరికి.. మురారి వాళ్ళ పెద్దమ్మ భవాని కాల్ చేస్తుంది. "ఏంటి మురారి.. ఇంత జరిగినా ఈ పెద్దమ్మతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నిన్ను సస్పెండ్ చేశారని నాతో ఎందుకు చెప్పలేదు" అని భవాని అంటుంది. "నువ్వు నాతో మాట్లాడుతున్నావా పెద్దమ్మ.. నా మీద కోపం తగ్గిందా" అని మురారి అంటాడు. దానికి భవాని "నీ మీద కోపమేంటి మురారి.. నీ మీద కాదు. ఆ పిల్ల మీద. నువ్వు అన్నావే అలక అని.. అదే అంతే" అని అంటుంది. "మరి ఇన్ని రోజులు పరాయి వాడిగా చూశావ్" అని మురారి అనగా, "నువ్వేగా మమ్మల్ని పరాయి వాళ్ళని చేసావ్" అని భవాని అంటుంది. "పోనీలే పెద్దమ్మ.. నువ్వు మారిపోయావ్. అది చాలు. ఐ లవ్ యూ పెద్దమ్మ" అని మురారి అంటాడు. "అది సరే.. ఇలా జరిగిందేంటి. ఇంత సిన్సియర్ ఆఫీసర్ ని, అలా ఎలా సస్పెండ్ చేస్తారు. చెప్పు ఎవరితో ఫోన్ చేయించాలి? డీజీపితోనా..ఎవరితో?" అని భవాని అడుగుతుంది. "అదేం లేదు పెద్దమ్మ" అని అంటాడు మురారి. ఒక వైపు భవాని, మురారి కేస్ గురించి సీరియస్ గా మాట్లాడుతుంటే మరో వైపు కృష్ణ తీరిగ్గా కూర్చొని అన్నం తింటూ ఉంటుంది. ఇక ఫోన్ లో భవాని మాట్లాడుతూ "ఇక్కడ ముకుంద.. నీ గురించి ఆలోచిస్తుంది.. నీ భార్య ఏమో ఏమీ పట్టనట్టు అన్నం తింటుంది. తినేవాళ్ళని లేపకూడదనే సంస్కారం నాకుంది కాబట్టి సరిపోయింది లేకుంటే.. సరేలే.. అది అంతా వదిలెయ్ మురారి. నువ్వు త్వరగా ఇంటికి వచ్చెయ్" అని భవాని అంటుంది. "సరే పెద్దమ్మ.." అని కాల్ కట్ చేసి వస్తాడు మురారి.
"ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? కడుపు నిండిందా? నా బాధ నీకు సంతోషన్నాన్నిస్తుంది కదా. అందుకే నువ్వు ఇక్కడ కడుపు నిండా, తృప్తిగా తిన్నావ్ కదా. నాకిష్టమైన నా జాబ్ పోతే కూడా నీకు ఏమీ అనిపించలేదా?" అని మురారి అంటాడు. "కదా.. మనకి ఇష్టమైంది దూరమైతే భరించలేనంత బాధగా ఉంది కదా.. నీకు ఈ జాబ్ పోతే ఆస్తి ఉంది. కానీ నాకు ఎవరూ లేరు. నాకంటూ ఉంది ఒక్క మా నాన్న మాత్రమే. ఆయన్ని నువ్వు చంపేశావ్. నాకు పూడ్చలేని వెలితి. అలా చేసింది ఎవరూ? నువ్వు. నాన్న లేకుండా ఎలా బ్రతుకుతున్నానో తెలియదు. శూన్యమనిపిస్తుంది. మీకోసం ఇంత కుటుంబం ఉంది. బాగా సంతోషంగా ఉందా, కడుపు నిండిందా అని అన్నావ్ కదా.. ఉంది. కచ్చితంగా ఉంది. దేవుడు ఉన్నాడు. పైనుండి అన్నీ చూస్తున్నాడు. మా నాన్న ప్రాణం తీసినందుకు తగిన శాస్తే చేసాడు. నేను ఇలాగే అంటాను" అని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత మురారి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఉన్న మురారిని ఓదార్చడానికి ముకుంద వస్తుంది. "నీకు ఈ ఉద్యోగం ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను ఎవరు ఓదార్చినా ఆ బాధ తీరదు. కానీ నువ్వు వస్తే ఓదార్చాలని ఎదురుచూస్తున్నాను. నీకు నేనున్నాను" అని మురారిని ఓదార్చుతుంది. అప్పుడే బయటకు వస్తుంది కృష్ణ. వాళ్ళిద్దరిని అలా చూసిన కృష్ణ ఏం చేస్తుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.
![]() |
![]() |